ఇంగ్లాండ్ పై భారత్ 106 పరుగుల తేడాతో విజయం.

*విశాఖపట్టణం టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ 106 పరుగుల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 292కే కుప్పకూలింది. జాక్ క్రాలీ (73 పరుగులు) మినహా మిగతావారెవరూ రాణించలేదు. ఇక *టీమ్ఇండియా బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా 3, రవిచంద్రన్ అశ్విన్ 3, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు.* ఇక రెండు ఇన్నింగ్స్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన పేసర్ బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను *భారత్ 1-1తో సమం చేసింది* . ఇరుజట్ల మధ్య *మూడో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 15నుంచి రాజ్కోట్ వేదికగా జరగనుంది.

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 67/1తో ఇంగ్లండ్ నాల్గవ రోజు ఆట మొదలు పెట్టింది. ఇంగ్లండ్ జట్టు మరో 28 పరుగులు చేసిన తర్వాత నైట్ వాచ్‌మ‌న్ రెహాన్ అహ్మ‌ద్‌(23) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత ఓలీ పోప్‌(23)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రెండు బౌండరీలతో జో రూట్ మంచి ఊపు మీద ఉన్నట్టు కనిపించాడు. కానీ కాసేపటికే యష్ బౌలింగ్‌లో రూట్‌(16) ఔట్ అయ్యాడు…

అనంతరం బెయిర్‌స్టో (26)ను బుమ్రా ఎల్బీగా వెన‌క్కి పంపాడు. ఆ తర్వాత జట్టు స్కోరు మరో 40 పరుగులు చేశాక ఓపెనర్ క్రౌలే ఔటయ్యాడు. తర్వాత చివర్లో బెన్ ఫోక్స్, టామ్ హార్ట్‌లీ కాసేపు నిలకడగా ఆడారు. దీంతో భారత బౌలర్లు కాస్త విసిగి పోయారు. కానీ వారిద్దరినీ బుమ్రా ఔట్ చేయడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ లో యశస్వీ జైశ్వాల్ (209) డబుల్ సెంచ‌రీ చేయడంతో భారత్ 396 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 253పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లోనూ క్రౌలే (76) పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో భారత్ 255పరుగులకు ఆలౌట్ అయింది. భారత్- ఇంగ్లండ్ మూడవ టెస్టు ఫిబ్ర‌వరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జ‌రుగ‌నుంది.

ఇది ఇలా వుంటే టీమిండియా ఆల్ రౌండర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మ‌రో ఘ‌న‌త సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌‌పై అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వైజాగ్ టెస్టులో ఓలీ పోప్‌‌ను ఔట్ చేసి 96 వికెట్ ను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు స్పిన్న‌ర్ బీఎస్ చంద్ర‌శేఖ‌ర్ (95 వికెట్లు) పేరిట ఉండేది…