కల నిజమవుతున్నందకు దర్శకుడు సుకుమార్.,,చిరంజీవికి ధన్యవాదాలు….

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయనున్న దర్శకుడు సుకుమార్.. అవును చాలా యేళ్లకు నా కల నిజమవుతున్నందకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా డైరెక్టర్ సుకుమార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేసారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మెగాస్టార్చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కంప్లీటైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తొలిసారి పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు..ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో పాటు చిరంజీవి .. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు బాబీ సినిమా చేస్తున్నారు. ఇంకోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు… ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ యాడ్‌‌ను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ రకంగా నైనా సుకుమార్.. చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.