గుడిపల్లి ఎస్.ఐ. గోపాల్ రావు సస్పెండ్….!

గుడిపల్లి ఎస్.ఐ. గోపాల్ రావు సస్పెషన్
– – పలు అవినీతి ఆరోపణల క్రమంలో సస్పెండ్
– – భూ వివాదాలలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్.ఐ. గోపాల్ రావు
ఎస్పీ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ డిఐజి ఉత్తర్వులు

నల్లగొండ : దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని గుడిపల్లి ఎస్.ఐ. గోపాల్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.

పలు అవినీతి ఆరోపణలు, భూ వివాదాలలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లుగా వచ్చిన ఆరోపణలు, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు పలు విషయాలలో బాధితులను పట్టించుకోక పోవడం లాంటి ఆరోపణల క్రమంలో విచారణ చేసి డిఐజికి నివేదిక సమర్పించడం జరిగిందన్నారు. ఎస్పీ నివేదిక ఆధారంగా ఎస్.ఐ. గోపాల్ రావును సస్పెండ్ చేస్తూ డిఐజి ఉత్తర్వులు జారీ చేసినట్లు రంగనాధ్ తెలిపారు.