తుపాను ముప్పు బెంగాల్ కే.. వాతావరణ శాఖ ప్రకటన..!

అమరావతి.. బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వైపు కదిలే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర అండమాన్‌ సముద్ర పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 22వ తేదీ నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.