నేను లొంగిపోతున్నా, నన్ను ఎన్ కౌంటర్ చేయకండి – ప్లకార్డులతో వచ్చిమరీ పోలీస్ స్టేషన్లలో లొంగిపోతున్న నేరస్థులు..

నేను లొంగిపోతున్నా, నన్ను ఎన్ కౌంటర్ చేయకండి – ప్లకార్డులతో వచ్చిమరీ పోలీస్ స్టేషన్లలో లొంగిపోతున్న నేరస్థులు..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరిగి అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే దాదాపు 50మంది నేరస్థులు లొంగిపోయారు. దోపిడీదొంగలు,గో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు సహా రకరకాల నేరాలు చేసిన వాళ్లు అందులో ఉన్నారు.వారిలో చాలామంది ప్లకార్డులు పట్టుకుని స్టేషన్లకు వచ్చారు. నేను లొంగిపోతున్నా.. దయచేసి నన్ను ఎన్ కౌంటర్ చేయవద్దు అని వాటిపై రాసిఉంది.కిడ్నాప్, దోపిడీ ఆరోపణలతో పరారీలో ఉన్న గౌతమ్ సింగ్ లొంగుబాటులో ఇది మొదలైంది.మార్చి 15న గోండా జిల్లాలోని ఛాపియా పోలీస్ స్టేషన్లో అతను లొంగిపోగా..మూడురోజుల్లో మరో 23 మంది అదేబాట పట్టారు. ఒకేసారి వారంతా సహరాన్ పూర్లోని చిల్కానా పోలీసు స్టేషన్ కు స్వయంగా వచ్చి లొంగిపోయారు. ఒక్క పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే నలుగురు మద్యం స్మగ్లర్లు మళ్లీ నేరం చేయబోమని అఫిడవిట్‌తో దేవబంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.