పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ కలయిక.. వీరిద్దరూ పరస్పరం బహుమతులు చుస్తే షాక్ అవుతున్నారు..

రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు 5 గంటల పాటు జరిగినట్లు సమాచారం. కాగా పుతిన్ తమ దేశానికి రావాల్సింది కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానించిన ప్యోంగ్యాంగ్ ప్రభుత్వ మీడియా KCNA (కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) నివేదించింది. పుతిన్, కిమ్ ఆహ్వానాన్ని అంగీకరించారు. ఆయన త్వరలో ఉత్తర కొరియాలో పర్యటించే అవకాశం ఉంది. పశ్చిమ దేశాల ఆంక్షాలతో ఒంటిగా ఉన్న ఉత్తర కొరియా రష్యాకు బేషరతు మద్దతు తెలిపింది..

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన ఆయన, ఇరు దేశాల మధ్య పలు అంశాలపై చర్చించారు. పుతిన్‌ను కలువుకోవడం ఒకటైతే, తన సాయుధ రైలులో ఉత్తర కొరియా నుంచి రష్యాకు ప్రయాణించి వార్తల్లో నిలిచారు కిమ్ జోంగ్. రష్యా ఫార్ ఈస్ట్‌లోని అముర్ ప్రాంతంలోని వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్‌లో బుధవారం పుతిన్‌తో కిమ్ సమావేశమై 40 సెకన్ల పాటు కరచాలనం చేశారు. సాధారణంగా ఎవరు కలుసుకోగానే పుష్పగుచ్చాలో, బహుమతులో ఇచ్చుకోవడం ఆనవాయితీ. అయితే ఈ ఇద్దరు నేతలు కలుసుకోగానే ఇచ్చుకున్న బహుమతులు చాలా చిత్రంగా ఉన్నాయి. పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ ఒకరికొకరు తుపాకీలను బహుమతిగా ఇచ్చుకున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.రష్యాకు చెందిన అత్యాధునిక రైఫిల్‌తో పాటు స్పేస్ గ్లోవ్‌ను కిమ్ జోంగ్ ఉన్ కు పుతిన్ బహుమతిగా ఇచ్చారని, దీనిని చాలాసార్లు అంతరిక్షంలోకి తీసుకెళ్లారని డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఇక ఉత్తర కొరియాలో తయారు చేసిన తుపాకీని పుతిన్‌కు బహుమతిగా కిమ్ జాంగ్ ఉన్ అందించారు. ఉత్తర కొరియాను సందర్శించాలన్న కిమ్ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని క్రెమ్లిన్ తెలిపింది. పుతిన్ పర్యటనకు ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను ఉత్తర కొరియాకు పంపుతామని, దాని సన్నాహాలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని డిమిత్రి పెస్కోవ్ చెప్పారు..రెండు దేశాలు అంతర్జాతీయ స్థాయిలో అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాలు తమ పరస్పర అవసరాలను తీర్చుకునేందుకు కలిసి రావాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీబీసీ ప్రకారం, ఉక్రెయిన్ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని, రష్యా కొత్త స్నేహితులను ఎంచుకోవడం ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాకు ఆయుధాలు అవసరం. ఉత్తర కొరియా విస్తృతంగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తోంది. అందుకే కిమ్‌, పుతిన్‌లు ఒకరినొకరు కలిశారు. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం సమస్య ఉంది. దీని కారణంగా కిమ్ జోంగ్ ఉన్ ఆయుధాలకు బదులుగా ఆహార సహాయాన్ని డిమాండ్ చేస్తున్నారట.

మాస్కో, ఉత్తర కొరియా ఏదైనా కొత్త ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకుంటే, వాటిపై అదనపు ఆంక్షలు విధించడానికి బిడెన్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. “యూఎన్. భద్రతా మండలి తీర్మానాన్ని ఉల్లంఘించే కార్యక్రమాలపై ఉత్తర కొరియాతో రష్యా సహకారం గురించి మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంది” అని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.