ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ఎక్స్‌ (X) వినియోగదారులకు షాక్‌…

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ఎక్స్‌ (X) వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ (Not A Bot) అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ (Subscription Plane)ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ట్విట్టర్‌ కొత్త యూజర్లు పోస్ట్‌ చేయాలన్నా, వేరొకరి ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేయాలన్నా, రిప్లే ఇవ్వాలన్నా, లైక్‌ కొట్టాలన్నా కొంత మేర డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఏడాదికి ఒక డాటర్‌గా సంస్థ వసూలు చేయనుంది..ఈ కొత్త నిబంధనను మొదట న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తున్నారు. స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే, సభ్యత్వం పొందకూడదనుకునే కొత్త వినియోగదారులు పోస్ట్‌లను చదవడం, వీడియోలను వీక్షించడం, ఖాతాలను అనుసరించే వెసులుబాటు ఉంటుంది…