ఫిబ్రవరి నెలలో ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్లు..

నిరుద్యోగుకులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని సిఎం రేవంత్ నిర్ణయించారు.

అందులో భాగంగా ఇప్పటికే టిఎస్‌పిఎస్సీ చైర్మన్, మెంబర్‌లను నియమించిన రేవంత్, త్వరలోనే ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని, దానికి సంబంధించి నివేదికను తయారు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్టుగా తెలిసింది.

ఆర్థిక శాఖ ఇచ్చే ఖాళీల ఆధారంగా టిఎస్‌పిఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను ప్రకియను ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ప్రారంభించ నుంది. ఇప్పటికే టిఎస్‌పిఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో పాటు సభ్యులు సైతం బాధ్యతలు చేపట్టగా త్వరలోనే సిఎం వారితో సమీక్ష నిర్వహిం చనున్నట్లుగా తెలిసింది.

యూపిఎస్సీ తరహాలో ప్రతి ఏడాది ఉద్యోగాల నియా మక ప్రక్రియ చేపట్టే లా కొత్త బోర్డు ప్రభుత్వం, ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోనున్నట్లుగా తెలిసింది.అభయ హస్తం హామీల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఫిబ్రవరి 1 నుంచి డిసెంబర్ 15లోగా పూర్తి చేస్తామని కాం గ్రెస్ హామీ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులోకి రాక ముందే కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీపై కసరత్తు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారు లను ఆదేశించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో 5వేల ఉద్యోగాలకు మరో 7 వేల ఉద్యోగాలు కలిపి మొత్తం 12వేల టీచర్ల ఉద్యోగాలకు మెగా డిఎస్సీ వేయాలని రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది.