బెంగళూరుపై రాజస్థాన్ ఘన విజయం…

Rajasthan reached the final after 14 years .A solid win over Bangalore..

బెంగళూరుకు నిరాశే, ఫైనల్‌కు చేరిన రాజస్థాన్, జోస్‌ బట్లర్ అజేయ సెంచరీతో రాజస్థాన్‌లో జోష్,..

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు కెప్టెన్ నిర్ణయం సరైందేనని బౌలర్లు నిరూపించారు. బెంగళూరు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు….

ఐపీఎల్ 2022లోనూ ఆర్‌సీబీ టైటిల్ కల నెరవేరలేదు. ఆరు సీజన్ల తర్వాత ఎలిమినేటర్ గండాన్ని దాటిన ఆర్‌సీబీ, క్వాలిఫైయర్‌ని సరిహద్దు దాటలేకపోయింది. 8వ సారి ప్లేఆఫ్స్‌కి చేరిన ఆర్‌సీబీ, 8వ సారి కూడా టైటిల్ గెలవకుండానే ఇంటిదారి పట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ, ఐపీఎల్ 2022 సీజన్‌ ప్రస్థానాన్ని సెమీ ఫైనల్‌లో ముగించింది… రెండో క్వాలిఫైయర్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మే 29న గుజరాత్ టైటాన్స్‌తో టైటిల్ ఫైట్‌లో తలబడనుంది… 158 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కి శుభారంభం అందించారు సెలక్టర్లు. 13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు… 21 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన సంజూ శాంసన్, హసరంగ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. అయితే అప్పటికే రాజస్థాన్ రాయల్స్ 50 బంతుల్లో 45 పరుగులు మాత్రమే చేయాల్సిన పరిస్థితికి చేరుకుంది…