సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత…

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.

సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా 1972-75 మధ్యకాలంలో పని చేశారు.

1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ అవార్డులు ఆయనను వరించాయి. రాజ్యసభ సభ్యుడిగా, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు…