ఏప్రిల్ 3వ తేది నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలు.హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్రయాణం..!!

ఏప్రిల్ 3వ తేది నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా సిద్ధం కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. విద్యార్థులు త‌మ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని సూచించారు.