మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు..ఈసారీ ఆరు పేపర్లకే ఎగ్జామ్స్‌.

*SSC Exams |
మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు.. ఈసారీ ఆరు పేపర్లకే ఎగ్జామ్స్‌.

పదోతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

వొకేషనల్‌ ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కూడా అదే నెలలో ఉంటాయని వెల్లడించారు..

SSC Exams | హైదరాబాద్‌: పదోతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వొకేషనల్‌ ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కూడా అదే నెలలో ఉంటాయని వెల్లడించారు. నిరుడు నుంచి 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకే పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.

*నామినల్‌రోల్స్‌ ఆన్‌లైన్‌లో..*

పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ను ఇక నుంచి ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. దీనిని యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌) ప్లస్‌లోని విద్యార్థుల డాటాను ప్రామాణికంగా తీసుకొంటారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో గుర్తింపు పొందిన పాఠశాలలు తమ వద్ద చదివే విద్యార్థుల డాటాను యూడైస్‌ ప్లస్‌ వెబ్‌సైట్‌లో ఈ నెల 28లోపు అప్‌డేట్‌ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన సూచించారు. విద్యార్థుల తాలూకు సమగ్ర సమాచారాన్ని పూరించాలని చెప్పారు.