తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయివేటు విద్యార్థుల విషయానికి వస్తే 819 మంది హాజరు కాగా, 425 మంది పాసయ్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారు…. విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov. in, www.bseresults comలో చూడవచ్చు…పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తాను చాటారు. 92.45 శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలు విజయభేరి మోగించారు. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రయివేటు విద్యార్థుల్లోనూ బాలికలదే పైచేయి. బాలికలు 58.76 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 46.21 శాతం పాసయ్యారు. 3,007 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.