111 జీవోను ఎత్తేయాలని కేబినెట్‎లో నిర్ణయం…

111 జీవోను ఎత్తేయాలని కేబినెట్‎లో నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు తొలగించి జీవోను ఎత్తేస్తామని.. అందుకోసం సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. అదేవిధంగా మూసీ, ఈసా నదీ జలాలను కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు….సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి‎భవన్‎లో నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం ఢిల్లీలో నిరసన తెలిపిన సీఎం కేసీఆర్.. మంగళవారం హైదరాబాద్‎లో కేబినెట్ భేటీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు….