Telangana తెలంగాణా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వయంగా సీఎం రేవంత్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది…ప్రతి ఎకరానికీ ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. వీటితో పాటు భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ఏటా రూ.12 వేలు సాయం అందించేందుకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం వెల్లడించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు పంపిణీ జరగనుంది. ఇక ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ జరగనుంది.
ఇతర కేబినెట్ నిర్ణయాలు:
పంచాయతీరాజ్లో 508 కారుణ్య నియామకాలు
కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్ ఆమోదం
-పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు..-పాలమూరు ప్రాజెక్టు ప్యాకేజీ-2 వ్యయం రూ.1,784 కోట్లకు పెంపు
-పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్లో 588 కారణ్య నియామకాలకు ఆమోదం
-56 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో వీలినానికి గ్రీన్సిగ్నల్..
-టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణ..
జనవరి 26 నుంచి కొత్త పథకాలు...
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. ఈ నెల 26న పలు కొత్త పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. రైతాంగానికి కొత్త సంవత్సరం మంచి జరగాలని తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. వ్యవసాయం పండగ చేయాలని తమ ఆలోచన అని తెలిపారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఏడాది రూ.10 వేలు ఇచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేలు వ్యవసాయ యోగ్య భూములన్నింటికీ ఇస్తామని ప్రకటించారు…