20 నెల‌ల కాల వ్య‌వ‌ధిలోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీవ్ర వ్య‌తిరేక‌త.. కేటీఆర్..

20 నెల‌ల కాల వ్య‌వ‌ధిలోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ స‌త్తా చాటాల‌న్నారు. సిరిసిల్ల‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు..అందరిలో ఒకడిగా ఉంటాను. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు మంచిరోజులు రాబోతున్నయి. ఇప్పుడు ప్రజలకు కేసీఆర్ విలువ తెలుస్తుంది. స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పట్టుదలతో పని చేయాలి. బూత్ స్థాయిలో మెజారిటీ తీసుకురావాలి. ఎంత పెద్ద నాయకుడైన ఊర్లో మెజారిటీ తీసుకురావాలి. చినుకు చినుకు కలిసి వరద అయినట్లు ప్రతి ఒక్క ఓటును రాబట్టుకోవాలి. పోయిన కాడనే వెతుక్కోవాలి.. మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే ప్రతి సీటు గెలవాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.

గత పదేళ్ళలో ప్రజలకు చేయాల్సిన పనులన్నీ చేశాము. ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి మోసపోయారు. రైతులకు కేసీఆర్ సాగునీళ్లు, రైతుబంధు, రైతుభీమా ఇచ్చారు. కార్యకర్తలందరూ కలిసి పని చేయాలి. మనం కూసున్న చెట్టు కొమ్మను మనమే నరుక్కున్నాము. ప్రజలంతా బీఆర్ఎస్‌కే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి రైతు తినే పళ్ళెంలో మట్టి పోసుకున్నామని బాధపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదు. రైతుబంధు రాదు, రైతు బీమా రాదు, బోనస్ రాదు. కానీ ఓట్లు ఉన్న‌ప్పుడే నోట్లు వేస్తున్నాడు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.