రూ.2 వేల నోట్లుపై కేంద్రం కీలక ప్రకటన …2 వేల రూపాయల నోటు చెల్లదు..

2000 నోటు చలామణిపై సందేహాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ చెక్ పెట్టింది. ఈ పెద్ద నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది..
అక్టోబర్ 1 నుంచి 2 వేల రూపాయల నోటు చెల్లదు; వెంటనే బ్యాంకుల్లో మార్చుకోండి..₹2000 notes: 2 వేల రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల నోటు సెప్టెంబర్ 30వ తేదీ వరకే చెల్లుతుందని, ఈ లోపు తమ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని శుక్రవారం సంచలన ప్రకటన చేసింది..

ఆర్బీఐ వెబ్ సైట్ క్రాష్

రూ. 2 వేల నోటును చెలామణి నుంచి తొలగించబోతున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే, ఆర్బీఐ వెబ్ సైట్ www.rbi.org.in కి ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది. ఆర్బీఐ ప్రకటనలోని నిజానిజాలను నిర్ధారించుకోవడానికి, ఇతర వివరాలను తెలుసుకోవడానికి ప్రజలు పెద్ధ ఎత్తున ఆర్బీఐ వెబ్ సైట్ www.rbi.org.in ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. దాంతో, ఈ హెవీ లోడ్ ను తట్టుకోలేక, ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ www.rbi.org.in క్రాష్ అయింది