నేటితో 2000 నోటు ఇక కనుమరుగు…!

నేటితో 2000 నోటు ఇక కనుమరుగు…

దేశంలో చలామణిలో ఉన్న అత్యధిక మారకపు విలువగల పింక్‌ నోట్‌కు శనివారంతో కాలం చెల్లిపోతోంది. రూ.2 వేల మారకపు విలువ కలిగిన ఈ నోటును ప్రవేశపెడుతున్నట్లు 2016 నవంబర్‌ 8న ప్రభుత్వం ప్రకటించింది.రెండ్రోజుల కాలవ్యవధిలో నవంబర్‌ 10 నుంచి ఈ నోట్లు చలామణిలోకి వచ్చాయి.

కాగా 2019మార్చి వరకు వీటిని రిజర్వ్‌బ్యాంక్‌ ముద్రించింది. ఆ తర్వాత ముద్రణ ఆపేసింది. ఈ ఏడాది మే 20నాడు ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటించింది. చలామణిలో ఉన్న నోట్లన్నీ తిరిగి బ్యాంక్‌కు చేరవేసేందుకు సెప్టెంబర్‌ 30వరకు గడువిచ్చింది.

2016 నవంబర్‌ 8నాటికి దేశంలో గరిష్ట మారకపు విలువ గలిగిన నోటుగా వెయ్యి రూపాయల కరెన్సీ ఉండేది. అయితే ఇది ఎక్కువగా నల్లధన మదు పరుల వద్దే ఉండిపోయింది .

అలాగే ఉగ్రవాదులు, అసాంఘిక కార్యకలాపాల నిర్వహణలో ఈ నోట్లే ఎక్కువగా చలామణి అవుతున్నట్లు కేంద్రం గుర్తించింది. పాకిస్థాన్‌ కేంద్రంగా నకిలీ నోట్ల ముద్రణదార్లు కూడా వెయ్యి రూపాయల నోట్ల తయారీపైనే ఎక్కువ దృష్ట పెట్టినట్లు స్పష్టమైంది. దీంతో చలాణిలో ఉన్న 1000, 500రూపాయల నోట్లను కేంద్రం అకస్మాత్తుగా నిలిపేసింది.

అదే సమయంలో కొత్త ఫీచర్స్‌తో రూ.500 నోట్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు అధిక మారకపు విలువ కలిగిన రూ.2 వేల నోట్లను కూడా చలామణిలోకి తెచ్చింది.

కాగా ఇప్పుడు చరిత్ర పునరావృతమైంది. 1996కి ముందు నల్లధన మదుపరులు, ఉగ్రవా దచర్యలు, అసాంఘిక కార్యకలాపాల నిర్వాహకులకు ఆసరాగా ఉన్న వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తే ఆ స్థానంలో వచ్చిన 2 వేల రూపాయల నోట్లను వీరు వినియోగించుకోవడం మొదలెట్టారు.

రిజర్వ్‌బ్యాంక్‌ ముద్రించిన నోట్లలో 70శాతానికి పైగా మార్కెట్లో చలామణిలోకి రావడంలేదుఅని నిపుణులు చెబుతున్నారు…