టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2022 షెడ్యూల్‌ విడుదల.. మళ్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్…

R9TELUGUNEWS.COM.
టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2022 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) శుక్ర‌వారం విడుద‌ల చేసింది. అక్టోబర్ 23న భారత్ దాయాది జట్టు పాకిస్థాన్‌తో తొలి పోరులో తలపడనుంది. ..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2022 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి..ICC శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ ఏడాది ప్ర‌పంచ‌క‌ప్‌కు ఆస్ట్రేలియా అతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే.
అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మెగా టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి.

R9TELUGUNEWS.COM.
నవంబర్‌ 9న తొలి సెమీఫైనల్‌ జరగనుండగా..
నవంబర్‌ 10న రెండో సెమీస్‌ జరుగుతుంది.
ఇక మెల్‌బోర్న్‌ వేదికగా నవంబర్‌ 13న ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది…

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ సూపర్-12 స్టేజీలో జట్లను ఐసీసీ రెండు గ్రూపులుగా విభజించింది. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉండగా..
గ్రూప్-2లో
భారత్‌, పాకిస్థాన్,
దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు.
ఇక క్వాలిఫయర్ మ్యాచ్‌లలో
శ్రీలంక, నమీబియా,
వెస్టిండీస్, స్కాట్లాండ్ సహా మరో రెండు జట్లు తలపడనున్నాయి. ఇందులోని నాలుగు జట్లు సూపర్-12లో ప్రవేశించనున్నాయి….

మ‌రోసారి దాయాదుల పోరు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ వేదిక కానుంది. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో దాయాది జట్టు పాకిస్థాన్‌తో భారత్ తొలి పోరులో తలపడనుంది. టీ20 ప్ర‌పంచక‌ప్ 2021 లీగ్ ద‌శ‌లో పాక్ చేతిలో భారత్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్థాన్‌ చేతిలో ఓటమి ఎరగని భారత్.. అప్పటి తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయం పాలైంది. ఈ సారైనా పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నారు…
R9TELUGUNEWS.COM