బాణసంచా పరిశ్రమలో పేలుడు 23 మంది మృతి….

థాయిలాండ్‌లోని 23 killed in firework factory explosion in Suphan Buri … బాణసంచా పరిశ్రమలో పేలుడు జరిగి 23 మంది మరణించారు. సుఫాన్‌బురి ప్రావిన్సులో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ విపత్తు సహాయక సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఫిబ్రవరిలో జరిగే చైనా నూతన ఏడాదిని పురస్కరించుకొనే డిమాండ్‌కు అనుగుణంగా ఇక్కడ పెద్ద ఎత్తున బాణసంచా తయారీ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్కడ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని భావిస్తున్నారు..