238 సార్లు ఓడినా.. మళ్లీ పోటీ…!

28. 3. 2024
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన పద్మరాజన్ పోటీ చేస్తుంటారు. సర్పంచ్ నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకూ బరిలోకి దిగుతారు. ఇప్పటివరకు ఆయన 238 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఎలక్షన్ కింగ్ పిలిచే పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాజ్పేయీ, మన్మోహన్, మోదీ, రాహుల్ మీద పోటీకి దిగారు. డిపాజిట్ల రూపంలో రూ.లక్షలు నష్టపోయారు. ప్రస్తుతం ఆయన ధర్మపురి నుంచి MPగా పోటీ చేస్తున్నారు!.

తమిళనాడుకు చెందిన టైర్లు రిపేర్‌ చేసే షాప్‌ ఓనర్‌ కే. పద్మరాజన్‌. ఆయన దక్షిణ తమినాడులోని మెట్టూరు పట్టణానికి చెందినవారు. అయితే ప్రతి ఎన్నికలో తాను పోటీ చేస్తున్నందుకు అందరూ నవ్వేవారని తెలిపారు. కానీ, ఓ సామాన్యుడు ఎన్నికల్లో భాగంకావటంపైనే తన దృష్టి ఉంటుందని అంటున్నారు. అయితే ఎన్నికల్లో పోటీచేసే అందరూ విజయాన్ని కాంక్షిస్తారు. కానీ, నేను అలా కాదు. నేను పోటీలో పాల్గొనటమే నా విజయంగా భావిస్తాను. నేను ఓడిపోతున్నాని తెలిసిన మరుక్షణం.. ఆ ఓటమి ఆనందంగా స్వాగతిస్తానని తెలిపారు.

స్థానికంగా ‘ఎలక్షన్‌ కింగ్‌’అని పిలువబడే పద్మరాజన్‌.. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేయటం గమనార్హం. 1988 నుంచి పలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పద్మరాజు.. అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీలపై పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం ప్రాధాన్యం కాదని, ప్రత్యర్థి ఎవరు? అనేది తాను అస్సలు పట్టించుకోని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ ఎన్నిసార్ల ఓడిపోవటానికైనా సిద్ధమని తెలిపారు..

ఇలా ఎన్నికల్లో పోటీ చేయటం అంత సులభం కాదన్నారు. తాను ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వేల రూపాయాలు పొగొట్టుకున్నానని తెలిపారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌ రూ. 25వేలు. ఎన్నికల్లో పోల్‌ అయ్యే ఓట్లలో 16 శాతం ఓట్లు పడకపోతే పెట్టిన సెక్యూరిటీ డిపాజిట్‌ గల్లంతు అవుందని అన్నారు..