ఇద్దరు చిన్నారులను ఉరి వేసి చంపిన తల్లి..తానూ ఉరి వేసుకుని మృతి…

R9TELUGUNEWS.COM.
క్రైమ్ న్యూస్..
*హైదరాబాద్‌ /రాజేంద్రనగర్‌లో విషాద ఘటన*

ఇద్దరు చిన్నారులను ఉరి వేసి చంపిన తల్లి..తానూ ఉరి వేసుకుని
మృతి

తల్లి స్వాతి (35)
కుమారుడు తన్విక్‌ (5),
కుమార్తె శ్రేయ(3) మృతి

భార్యాభర్తల మధ్య వివాదమే కారణంగా స్థానికుల సమాచారం…రాజేంద్రనగర్​ పీఎస్​ పరిధిలోని పోట్వీ కాలనీలో శ్రీనివాస్​ అపార్ట్​మెంట్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి సాయి, స్వాతి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు తన్విక్​(5), కుమార్తె శ్రేయ ఉన్నారు. సాయి చేసిన అప్పులు తీర్చలేక తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో సాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.మనస్తాపం చెందిన స్వాతి చనిపోవాలని నిర్ణయించుకుంది. తాను చనిపోతే పిల్లలు దిక్కులేని వారై పోతారని ఆలోచించింది. భర్త వేధింపులు తాళలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్​ లెటర్​ రాసి ముందుగా ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తెకు ఉరివేసి.. తానూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇవాళ భర్త సాయి తిరిగి ఇంటికి వెళ్లి చూడగా.. భార్య, పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు…