జిఎస్టీ రూపంలో ఎక్కువ పన్నులను వసూలు చేస్తున్నందుకు.. 26వ తేదీన భారత్ బంద్ కు సన్నాహాలు…!

సామాన్యుడిపై అధిక భారాన్ని మోపుతూ జిఎస్టీ రూపంలో పేదవాడి దగ్గరనుంచి ఎక్కువ పన్నులను వసూలు చేస్తున్నందుకు గాను 26వ తేదీన భారత్ బంద్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.

జీఎస్టీకి వ్యతిరేకంగా అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) ఫిబ్రవరి 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. అదే రోజు చక్కా జామ్ రహదారుల దిగ్భందంను నిర్వహిస్తామని అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం (ఐట్వా) సంఘీభావం ప్రకటించింది. జీఎస్టీతో వర్తకులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని సీఏఐటీ పేర్కొంది. జీఎస్టీ లోటుపాట్లపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా జీఎస్టీ కౌన్సిల్ స్పందించలేదని వర్తక సంఘాల నేతలు ఆరోపించారు.జీఎస్టీ లోపాలను సవరించాలంటూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ డిమాండ్ చేస్తుంది. క్యాట్ పరిధిలోకి వచ్చే దేశానికి చెందిన 8 కోట్లకు పైగా వ్యాపారవేత్తలు ఈ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం కూడా ఈ బంద్‌కు మద్దతు తెలిపింది. జీఎస్టీని సరళతరం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆసక్తి కనబరచడం లేదని, కేవలం ఆదాయం పెంచుకునేందుకే మొగ్గుచూపుతోందని వర్తక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు నిరసనగా జీఎస్టీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 26వ తేదీన భారత్ బంద్ కి పిలుపునిచ్చింది…పెంచిన ధరలపై జీఎస్టీలను తగ్గించేందుకు నిరసన తెలపాలని వర్తక సంఘాలు నిర్ణయించాయి. ప్రతి భారతీయుడికి సామాన్యుడికి మధ్యతరగతి వారికి అందుబాటులో ధరలు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీ రూపంలో అధికంగా డబ్బును ఎక్కువగా వసూలు చెయ్యడం మానుకోవాలని ఈ భారత్ బంద్‌ను నిర్వహించనున్నారు.