లాలూ ప్రసాద్ ఆరోగ్యం పరిస్థితి విషమం..

ఆర్జేడీ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో డాక్టర్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి త‌ర‌లించాల‌ని డాక్టర్లు సూచించారు.దీంతో లాలూని వెంటనే విమానంలో ఢిల్లీకి తీసుకెళ్ల‌నున్నారు. ఈ విష‌యంపై రాంచీ రిమ్స్ డాక్టర్లు మాట్లాడారు. అన్ని వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌, ప‌రిస్థితుల‌ను అంచనా వేసుకుని.. లాలూను ఏయిమ్స్ కు పంపాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు రిమ్స్ డైరెక్ట‌ర్ కామేశ్వ‌ర్ ప్ర‌సాద్ తెలిపారు. జైలు అధికారుల నియ‌మ నిబంధ‌న‌ల‌న్నీ పూర్తి చేసిన త‌ర్వాత‌, ఆయ‌న్ను ఎయిమ్స్ కు త‌ర‌లిస్తామ‌ని డాక్టర్లు ప్రకటించారు. లాలూకు గుండె జ‌బ్బులు, కిడ్నీ జ‌బ్బులు, మ‌ధుమేహం లాంటి ఇబ్బందులున్న నేప‌థ్యంలో డాక్టర్లు ఆయ‌న ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం ఓ వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు…