శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్ స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సు… పాల్గొన ప్రధాని మోడీ… షాక్ లొ చైనా…

శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్ స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడిన ఆయన.. రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అంతర్జాతీయ చట్టాల పాత్రను ప్రస్తావించారు.
బిమ్ స్టెక్ కూటమి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ముఖ్యమని మోడీ అభిప్రాయపడ్డారు. దక్షిణ ఆసియా ప్రాంతం ఆర్థిక, ఆరోగ్య పరమైన సవాళ్లు ఎదుర్కొంటోందని.. దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కోసం ఓ అంగీకారానికి రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బంగాళాఖాతం ప్రాంతం.. అనుసంధానత, శ్రేయస్సు, భద్రతకు వారధిగా మారే టైమ్ వచ్చిందన్నారు. బిమ్ స్టెక్ బడ్జెట్ కోసం భారత్ తరఫున వన్ మిలియన్ డాలర్లు అందించనున్నట్లు మోడీ ప్రకటించారు.
సభ్య దేశాల మధ్య వ్యాపారాన్ని పెంచేందుకు బిమ్ స్టెక్ ఎఫ్టీఏ ప్రతిపాదనపై వేగంగా ముందుకు సాగాలని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. బిమ్ స్టెక్ ఆధ్వర్యంలోని వాతావరణ, శీతోష్ణస్థితి కేంద్రం ఏర్పాటు ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విపత్తుల నిర్వహణ, వాటి ముప్పు తగ్గించేందుకై ఏర్పాటు చేసే కేంద్రం కోసం.. 3 మిలియన్ డాలర్ల నిధులు అందిస్తామని ప్రకటించారు. నలంద ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇస్తున్న స్కాలర్ షిప్ ప్రోగ్రాం పరిధిని పెంచుకున్నట్లు చెప్పిన ప్రధాని మోడీ… క్రిమినల్ కేసుల విషయంలో న్యాయ సాయం కోసం ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. సౌత్ ఆసియాలోని 7 దేశాలు వివిధ రంగాల్లో ఆర్థిక, సాంకేతిక సహకారం కోసం బిమ్ స్టెక్ ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, భారత్, శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్ దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి…

ఆసియా దేశం లో నేనే రా రారాజు అని చెప్పుకొని తిరుగుతున్న చైనాకి ఇదొక ఇబ్బందికర అంశం కూడా కావచ్చు అని అంటున్నారు విశ్లేషకులు… ఇన్ని రోజులు భారత్ కు వ్యతిరేకంగా
బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్,, శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్ దేశాలు ఉన్నాయి అంటూ ప్రచారం చేస్తున్న చైనా కు ఇది ఒక షాకింగ్ న్యూస్ గానే భావిస్తున్నారు.