3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల…

నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.

ఫిబ్రవరి 16న త్రిపురలో.. ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొంది.