30న మధ్యాహ్నం ఒంటి గంటకు నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్..

30న మధ్యాహ్నం ఒంటి గంటకు నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు నూతన సచివాలయానికి చేరుకోనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో కేసీఆర్ ఆశీనులు కానున్నారు.

అనంతరం పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేసి పరిపాలనను ప్రారంభించనున్నారు.

రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్‌, సీపీ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు నూతన సచివాలయానికి చేరుకోనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో కేసీఆర్ ఆశీనులు కానున్నారు. అనంతరం పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేసి పరిపాలనను ప్రారంభించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ తన చైర్‌లో ఆశీనులయ్యే సమయంలో అక్కడకు మంత్రులు, ఇతరులు ఎవరు కూడా రావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి