ఉపరితలద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

రుతుపవనాలు తెలుగు రాష్ట్రంలో ప్రవేశించిన అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురవడం జరుగుతోంది… ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రోజు ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యాయి..మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. మరోవైపు ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని తెలిపేరు…..