సెల్ఫీ కన్నా ప్రాణం మిన్న ..

ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో జూరాల ప్రాజెక్టు వద్ద జాగ్రత్తలపై అవగాహన పై అవగాహనలో భాగంగా ప్రాజెక్టు వద్ద జాగ్రత్తల వాల్ రేటింగ్ గోడలపై రాయించడం జరిగింది ప్రాజెక్టు కు వచ్చే సందర్శకులకు జాగ్రత్తలపై అవగాహన పరచడం జరిగింది తగు సూచనలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా వైస్ చైర్మన్ సయ్యద్ కలాంపాషమాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కాజా కుతుబుద్దీన్ ఆదేశానుసారం అమరచింత మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు వద్ద వచ్చే సందర్శకులకు జాగ్రత్తలపై అవగాహన నిర్వహించడం జరిగింది ప్రమాదకర సెల్ఫీ ల కన్నా ప్రాణం మిన్న అతి సరదా అతి ఉత్సాహం ప్రమాదకరమే నది పరిసరాలకు నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పరిసరాలకు వెళ్ళద్దు అంటూ ఈ నదిలో ముసలి లు ఉంటాయని జాగ్రత్తలు పాటించాలని ఈ ప్రాజెక్టు పరిసరాలు ప్రమాదకరమని నది లో ఉండే రాళ్లపై బూజు ఉంటుందని కాలు పెడితే జారుతుందని జాగ్రత్తగా ఉండాలని నది ప్రవాహం ఎక్కువ ఉన్నందున స్థానాలు చేయరాదని సందర్శకులకు తగు సూచనలు చేస్తూ వారికి అవగాహన పంచడం జరిగింది