పక్క కమర్షియల్, ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..!

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘జి ఎ 2 పిక్చర్స్’ ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ల పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 1 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్లు రాబట్టింది. మొత్తంగా మొదటి వారం బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించే విధంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ రెండో వీకెండ్ ను ఆశించిన స్థాయిలో కలెక్షన్ రాబట్టుక లేకపోయింది…..
పక్కా కమర్షియల్’ చిత్రానికి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే చాలా ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు ఓన్ రిలీజ్ చేసుకున్నాయి. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15 కోట్లు గా ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.10.01 కోట్ల రూపాయలు పర్వాలేదు అనిపించింది..

ఓటీటీ లొ ఆగస్టు నెల…!!!

ఈ సినిమా ఈ రెండు ఓటీటీల్లో ఆగస్టు 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రయేషన్స్‌, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌లపై బన్నివాస్‌, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించారు. ఇక గోపించంద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నారు..
ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్ ఫ్లిక్స్ మరియు ఆహా లు కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి వీటిలో ఈ చిత్రం ఆగస్టు 5 లేదా 8 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించారు…