నేటి వార్తలు…

చైనా, జపాన్‌, దక్షిణకొరియా సహా ఐదు దేశాల ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ మస్ట్‌..

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శనివారం ఎయిర్‌పోర్టుల్లో అధికారులు ర్యాండమ్‌గా కొవిడ్‌ పరీక్షలు ప్రారంభించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి విమానంలో 2 శాతం మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఆ ప్రయాణికులను సంబంధిత విమానయాన సంస్థలు ఎంపిక చేస్తాయని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, భారత్‌లో ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో విమానాలపై ఆంక్షలు, లాక్‌డౌన్‌ విధింపు వంటి చర్యలు అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించండి..
పలు దేశాల్లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏ అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు దవాఖానల్లో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌, తగినస్థాయిలో సిలిండర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వెంటిలేటర్లు వంటి ప్రాణాధార వ్యవస్థల పనితీరును సరిచూసుకోవాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. పీఎస్‌ఏ ఆక్సిజన్‌ జనరేటింగ్‌ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూసుకోవాలని, వాటిని చెక్‌ చేసేందుకు రెగ్యులర్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని పేర్కొన్నది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దవాఖానల్లో మౌలిక సదుపాయాల పనితీరు, నిర్వహణను సరిచూసుకోవడం ముఖ్యమని తెలిపింది.

చైనాలో కరోనా కల్లోలం
చైనా రాజధాని బీజింగ్‌తో సహా పలు నగరాల్లో కొవిడ్‌ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరోనా బారిన పడిన వారితో దవాఖానలు నిండిపోతున్నాయి. బెడ్‌లు దొరకని పరిస్థితి నెలకొన్నది. అంత్యక్రియల నిమిత్తం శ్మశానవాటికలకు మృతదేహాలు భారీ సంఖ్యలో వస్తున్నాయని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఎన్ని దవాఖానలు తిరిగినా, కొవిడ్‌ బారిన పడిన తన బంధువుకు బెడ్‌ దొరకలేదని యావ్‌ రుయాన్‌ అనే వ్యక్తి వాపోయాడు. ఐసీయూలు నిండిపోవడంతో పాటు బెడ్లు లేకపోవడంతో.. రోగులు దవాఖాన కారిడార్లలోని బెంచీలపై, నేలపైనే పడుకొంటున్నారు.
———————-
ఘోషామహల్ లొ కుంగిన నాలా..

ఘోషామహల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చక్కన్వాడి ప్రాతంలో నాలా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నాలాపై నిలిపి ఉంచిన వాహనాలతో పాటు షాపులు కూడా నాలాలో పడిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చాక్కన్వాడిలో 30 ఏళ్ల క్రితం నాటి ఓ నాలా పై నిర్మించిన రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న కార్లు, బైకులు, ఆటోలు అందులోకి పడిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లుగా సమాచారం అందుతోంది. ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో అక్కడ రైతు బజార్ కు ఏర్పాట్లు జరగుతున్నాయి. నాలాపైనే కూరగాయాలు, ఇతర సరుకులను విక్రయించేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా నాలా కుంగిపోవడంతో కూరగాయలు, సరుకులన్నీ నాలాలోకి పడిపోయాయి. ఇక ఈ ప్రాంతంలో పార్క్ చేసిన వాహనాలు నాలాలో పడిపోగా, ఇందులో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. రోడ్డు కుంగే సమయంలో రద్దీ తక్కువగా ఉండటం, వాహనాల రాకపోకలు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. నాలా కూలిపోవటానికి గల కారాణాలను ఆరా తీశారు.
————————-

విజయవాడ

*విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం …*

ప్రసవం కోసం వచ్చిన వారి వెంట ఒక్కరే ఉండటంతో , పరిచయం లేని వ్యక్తులకు పసికందుని అప్పజెప్పి లగేజీ తెచ్చుకోవడం కోసం కిందకి వెళ్లిన మహిళా……

మహిళా తిరిగి వచ్చేలోగా పసికందు మాయం …

విచారణ మొదలు పెట్టిన ఆసుపత్రి సిబ్బంది….

———————-

నందిగామ

*నిషేధిత గంజాయి దహనం…*

కమిషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన గంజాయిని దహనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు…

కంచికచర్ల మండలం దొనబండ క్వారీ ప్రాంతంలో గంజాయి దహనం కోసం ఏర్పాట్లు..

—————
ఆర్మీ అధికారి అయినా.. అమ్మకు కొడుకేగా!

ఒక ఆర్మీ ఆఫీసర్ తన తల్లికి ఇచ్చిన గౌరవంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆర్మీ మేజర్ జనరల్ రంజన్ మహాజన్ తన పదవీ విరమణకు ముందు తల్లిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లి, సైనిక దుస్తుల్లోనే ఆమెకు సెల్యూట్ చేశారు.

తన 35ఏళ్ల సర్వీసు ఆమెకు అంకితమిస్తూ తల్లికి పూలమాల వేశారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. నెటిజన్లు స్పందిస్తూ ఆర్మీ అధికారి అయినా ఓ అమ్మకు కొడుకేగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

——————–..
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం..

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొదలైంది. జిల్లా కోస్తా తీరంతో పాటు దక్షిణ మండలాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు మండలాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.
———————
కర్ణాటకలో బిజెపికి షాక్ గాలి జనార్దన్ రెడ్డి బిజెపికి రాజీనామా..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కర్ణాటకలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. ఆ రాష్ట్రంలో కీలక నేత, మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి అయిన గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజీనామా చేశారు. సొంతంగా కొత్త పార్టీని ప్రకటించారు. కొంతకాలంగా బీజేపీతో అసంతృప్తితో ఉన్న జనార్దన్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాసం ‘పారిజాత’‌లో మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆయన తన కొత్త పార్టీ పేరు ‘కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష’ అని ప్రకటించారు. ఇకపై సొంత పార్టీతో రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని వెల్లడించారు. బీజేపీతో తన బంధం ముగిసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తానని తెలిపారు. కర్ణాటక ప్రజల హృదయాలను తమ పార్టీ గెలుచుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త పార్టీతో రాబోయే, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పోటీ చేసే నియోజకవర్గాలతో పాటు పార్టీ మేనిఫెస్టో ను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. తాను గంగావతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.
————————.
మందుకు బానిసైన వ్యక్తికి పిల్లను ఇవ్వొద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ అన్నారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఒక కూలీ లేదా రిక్షా కార్మికుడిని పెళ్లికొడుకుగా ఎంపిక చేయడం మంచిదని చెప్పారు. తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటైన తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని డీ అడిక్షన్ కేంద్రంలో కూడా చేర్పించామని… ఆ అలవాటును మానేస్తాడనే అనుకున్నామని… ఆ తర్వాత ఆరు నెలలకు పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. కానీ, మళ్లీ తాగడాన్ని ప్రారంభించాడని, చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని తెలిపారు. అతను చనిపోయేటప్పుడు అతని కుమారుడికి రెండేళ్ల వయసు మాత్రమేనని చెప్పారు. అతని భార్య ఏకాకిగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదని చెప్పారు. ఇలాంటి పరిస్థితి నుంచి మీ కూతుర్లని, అక్కచెల్లెళ్లను కాపాడుకోవాలని తెలిపారు. మద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది మరణిస్తున్నాని చెప్పారు. మద్యానికి అలవాటైన వారి జీవిత కాలం చాలా తక్కువని అన్నారు. పాఠశాలల్లో సైతం దీనిపై అవగాహన కల్పించాలని చెప్పారు.
—————-.
ఉత్కంఠ టెస్ట్ మ్యాచ్లో భారత్ గెలుపు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టెస్టు చూసిన వారు టెస్టులపై తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం ఖాయం. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన వేళ.. రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)-శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) ఆడిన తీరు చూసి అభిమానులు ముచ్చటపడ్డారు. కేఎల్ రాహుల్(2), శుభమన్ గిల్(7), చతేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (1), రిషభ్ పంత్(9) వంటి స్టార్ ఆటగాళ్లు బ్యాట్లు ఎత్తేసిన వేళ అశ్విన్, అయ్యర్ అసమాన పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు అక్షర్ పటేల్ (34) పరుగులతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

45/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా(Team India)కు శనివారం మొదలైన ఎదురుదెబ్బలు కొనసాగాయి. 56 పరుగుల వద్ద ఉనద్కత్ (13), 71 పరుగుల వద్ద రిషభ్ పంత్ (9), 74 పరుగుల వద్ద అక్షర్ పటేల్ (34) పెవిలియన్ చేరడంతో ఇక భారత్ పనైపోయిందని అభిమానులు ఉసూరుమన్నారు. అయితే, క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ తొలుత నెమ్మదిగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత సింగిల్స్ తీస్తూ, సంయమనంతో ఆడుతూ జట్టును విజయ తీరాలవైపు నడిపించారు. ఇలాంటి సమయాల్లో క్రీజులో పాతుకుపోవడమెలానో తెలిసిన అశ్విన్ తన అనుభవాన్ని రంగరించి క్రీజులో పాతుకుపోయాడు. అయ్యర్‌కు అండగా నిలుస్తూ చక్కని ప్రోత్సాహం అందించాడు. చివర్లో మెహదీ హసన్ బౌలింగులో రెండు వరుస ఫోర్లు కొట్టి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అయ్యర్ 46 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేయగా, అశ్విన్ 62 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు..