పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లారంటూ ఫిర్యాదు..!!

పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లారంటూ ఫిర్యాదు చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. చింతలకుంట జాంగీర్‌నగర్‌ కాలనీకి చెందిన ఎస్కే గజాన మహ్మద్‌ థాయిలాండ్‌లో కాహో మనీ బ్రీడ్‌కు చెందిన అరుదైన తెలుపురంగు పెంపుడు పిల్లిని కొనుగోలు హైదరాబాద్‌కు తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. పిల్లి కళ్లలో ఒకటి డైమండ్‌ కలర్, మరొకటి రెడిష్‌ గ్రే రంగుల్లో ఉండటం దీని ప్రత్యేకత. ఆదివారం రాత్రి నుంచి పిల్లి కనిపించకుండాపోయింది. చుట్టుపక్కల వెతికిని ఫలితం లేకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై వచ్చి ఎత్తుకెళ్లినట్లు రికార్డైంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు..