పుదుచ్చేరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్…!

పుదుచ్చేరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్ చేశారు. కరోనా సాకుతో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేదన్నారు. 5 లక్షల మందితో ఖమ్మంలో సభ పెట్టారు అక్కడ లేని కరోనా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్న గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రానికి రిపోర్ట్ పంపించానన్నారు…..
ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని యత్నించారు. ఓ శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్లడంతో మళ్లీ వేడుకలకు అవకాశం వచ్చింది. గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశాను. దాన్ని పక్కన పెట్టి రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలని రెండు రోజుల క్రితమే సమాచారమిచ్చారని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఆ లేఖలో కూడా సీఎం హాజరవుతారని పేర్కొనలేదన్నారు.