విద్యార్థుల‌తో కలిసి మంత్రి కేటీఆర్ భోజ‌నం..

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మ‌లాపూర్ మండ‌ల కేంద్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర‌, బాలిక‌ల గురుకుల పాఠ‌శాల భ‌వ‌న స‌ముదాయాలు, ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీ భ‌వ‌నం, క‌స్తూర్బా గాంధీ బాలిక‌ల విద్యాల‌యాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బీసీ వెల్ఫేర్ బాలుర‌, బాలికల గురుకుల పాఠ‌శాల‌ల విద్యార్థుల‌తో కలిసి మంత్రి కేటీఆర్ భోజ‌నం చేశారు. విద్యార్థుల‌తో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు మంత్రి కేటీఆర్…