పావురాలని పెంచుతున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.. పావురం కారణంగా ప్రాణాలు కోల్పోతారు..!!!

పావురం కారణంగా ప్రాణాలు కోల్పోయారు…

హైదరాబాదులో ఉన్న పావురాలను కూడా నల్లమోలలో వదిలేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం..

పావురాలకు సంబంధించిన రెక్కల నుండి వస్తున్న పొడి తో.. వాటి వ్యర్ధాలతో 18 రకాల వ్యాధులు ప్రబలుతున్నట్టు గుర్తించారు..

పావురాలతో చారిత్రాత్మక కట్టడాలు కూడా ఆగం కావడం కూడా జరుగుతుందని అభియోగాలు..

పావురాలు అందంగా ఉన్నాయి కదా శాంతికి మారు రూపం అనుకుంటూ మనం పావురాలని అత్యంత దగ్గరగా చేసుకొని మానవాళికి దగ్గరగా మెదులుతున్న పావురాలు గురించి ఈ వార్త వింటే అందరూ షాక్ కావాల్సిందే… పావురాల వల్ల ఇంత జబ్బులు వస్తున్నాయంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అందుకు తగినట్టుగా పరిశోధనలు కూడా నిజమని తేలడంతో ఒక్కసారిగా అవ్వకు గురవుతున్నారు…

సీనియర్‌ నటి మీనా భర్త విద్యాసాగర్‌(48) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో బాధ పడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. కాగా, ఆయన మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు మొదలయ్యాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్‌ మృతి చెందాడని స్థానిక మీడియాలో వార్తలు వెలుబడుతున్నాయి. మీనా ఫ్యామిలీ మొత్తానికి గతంలో కరోనా సోకింది. కోవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ… విద్యాసాగర్‌ కొన్ని నెలలుగా పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో బాధపడుతున్నాడు.పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు మాత్రమే ఆయన మృతికి కారణం కాకపోవచ్చని, పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే శ్వాసకోశ సమస్య రెట్టింపై ప్రాణాంతకంగా మారిందని స్థానిక మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మీనా ఫ్యామిలీ నివాసం ఉండే ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి విద్యాసాగర్‌ తరచూ దానా వేస్తూ అక్కడే గడిపేవాడట..కోవిడ్‌ సోకిన సమయంలో విద్యాసాగర్‌ ఊపిరితిత్తులు పాడైపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని వైద్యులు సూచించినప్పటికీ..దాతలు దొరక్కపోవడంతో విద్యాసాగర్‌ మృతి చెందినట్లు తెలుస్తోంది.పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్‌ మృతి చెందాడన్న వార్తలు వస్తున్నాయి..