ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు స్వల్ప అస్వస్థత..!!

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో కొంచెం నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి సీఎంకు కావాల్సిన అన్ని వైద్య పరీక్షలు చేయించారు. సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ పరీక్షలు కూడా నిర్వహించారు…

ఏఐజీ చైర్మన్‌ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని చెప్పారు వైద్యులు. గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్‌తో సీఎం కేసీఆర్‌ ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. సిటీ, ఎండోస్కోపీ వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నామని వివరణ ఇచ్చారు వైద్యులు. ఇక.. ఇప్పటికే గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు.. ఎమ్మెల్సీలు కవిత, కౌశిక్‌రెడ్డి, సీపీ స్టీఫెన్ రవీంద్ర చేరుకున్నారు.

*సీఎం కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగా ఉంది*

*ఏఐజి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు*

*వైద్య పరీక్షలు నిర్వహించిన ఏఐజి వైద్యులు*

*గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది – ఏఐజి వైద్యులు*

*సీటీ , ఎండోస్కోపీ వైద్య పరీక్షలు నిర్వహించాం – ఏఐజి వైద్యులు*

*సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నాం – ఏఐజి వైద్యులు*