ముగిసిన టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్..

హైదరాబాద్: ముగిసిన టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్..

మహబూబ్ నగర్ , రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసిన పోలింగ్…

97.15 శాతం పోలింగ్ నమోదు…

పోలీస్ భద్రత నడుమ సరూర్ నగర్ స్టేడియంకు బ్యాలెట్ బాక్స్ లు…

స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ భద్రత..

ఈనెల 16న కౌంటింగ్..

ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో మధ్యాహ్నం 2 గంటల వరకు 75శాతం ఓటింగ్‌ నమోదు కాగా.. సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 90 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే… దీనిపై పూర్తి అధికారిక ప్రకటన రాలేదు.

పోలింగ్‌ పూర్తిగా ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులకు సరూర్‌ నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరుచనున్నారు. ఈ నెల(మార్చి) 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది