ప్రియురాలిని చంపి కుక్కర్ లో ఉడకబెట్టాడు..

దారుణం.. ప్రియురాలిని చంపి కుక్కర్ లో ఉడకబెట్టాడు..

*మహారాష్ట్ర(Maharashtra) మహారాష్ట్రలోని థానేలో దారుణం చోటుచేసుకుంది…. ఓ 56 ఏళ్ల వ్యక్తి 32 ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేశాడు. నగరంలోని మీరా భయందర్(Mera Bhayandar) ప్రాంతంలో మనోజ్, సాహ్ని(Manoj Sahni) అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న సరస్వతి వైద్యను హతమార్చాడు.
ముంబైలో శ్రద్ధావాకర్‌ హత్యోదంతం తరహాలో జరిగిన మరో ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని థానేలో 56 ఏళ్ల మనోజ్‌ సానే అనే వ్యక్తి ప్రియురాలు సరస్వతి…ఆమె అహ్మద్‌నరగ్‌లోని జాంకీబాయి ఆప్టే బాలికాశ్రమంలో పెరిగినట్లు తేలింది. ఆమె తన అంకుల్‌ ముంబైలో ఉంటారని అతనితోనే ఉంటానని చెప్పేదని ఆ బాలికాశ్రమంలో పనిచేసే మహిళ చెబుతోంది. సరస్వతి అనాథశ్రమాన్ని సందర్శించిందని, అప్పుడు ఆమె చాలా సంతోషంగానే కనిపించిందని వెల్లడించింది. ఇక మనోజ్‌ సానే ఆమెను పెళ్లి చేసుకోలేదు. అతనికి ముంబైలోని బోరివాలిలో ఒక ఇల్లు ఉందని అక్కడ అతని కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు..

అనంతరం ట్రీ కట్టర్ సాయంతో ఆమె శరీరాన్ని 13 ముక్కలుగా కోసి కుక్కర్ లో వేసి ఉడకబెట్టాడు. శరీర భాగాలను బయట పడేసేందుకు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…