వీడియోలు తీసి పంపించండి బహుమతులు తెలుసుకోండి.. తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్..

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ వీడియోలు, రీల్స్ చేసే అలవాటు ఉందా.. అయితే చేసేయండి.. అవార్డులు పొందండి అంటోంది తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ. హరితహారం, పచ్చదనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ రీల్స్, వీడియోస్ చేసి పంపితే వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తామని రాష్ట్ర అటవీశాఖ తెలిపింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19వ తేదీన హరితోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా పచ్చదనం ప్రాముఖ్యత, హరితహారాన్ని మరింతగా ప్రోత్సహించడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నిమిషం నిడివి ఉండేలా రీల్స్, వీడియోస్‌ చేసి tkhh2023@gmail.com పంపాలని అటవీశాఖ సూచించింది.