మరో ప్యాన్ ఇండియా సినిమాలో హిరో నిఖిల్..

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత నిఖిల్ 18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన స్పై అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు.నిఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా స్పై. ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోంది. ఈ సినిమా జూన్ 29న విడుదలకానుందని ప్రకటించింది టీమ్. అయితే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడుతుందని కొంత కాలం టాక్ నడిచింది. ఈ విషయంలో హీరోకు, ఈ సినిమా నిర్మాతకు ఓ గొడవ కూడా జరిగిందని టాక్. ఈ సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో పెద్దగా ప్రమోట్ చేయడం కుదరదని.. సినిమా పోస్ట్ పోన్ చేయాలనీ హీరో డిమాండ్ చేశారట..

వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలను చేస్తూ.. నిఖిల్ సిద్ధార్ధ్ సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతున్నాడు.

భారత దేశంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆజాద్ హిందూ ఫౌజు దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ .. అదృశ్యం వెనక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది..
నిఖిల్ విషయానికొస్తే.. యువ నటుడు నిఖిల్ ఆమధ్య కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..