పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు మరోసారి హాట్ కామెంట్స్..!!!

పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

గతంలో కూడా సీఎం కేసీఆర్ ని దేవుడు అంటూ పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అప్పుడే దాదాపు రాజకీయ విశ్లేషకులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది…. ప్రస్తుతం ప్రత్యక్షంగానే
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కొత్తగూడెం అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో గడాల మాట్లాడుతూ.. రామాయంలో రావణాసురుడు ఉన్నట్లుగానే కొత్తగూడెంలో కూడా ఓ రావణాసురుడు ఉన్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఉద్దేశించేనా అనే టాక్ వినిపిస్తోంది. గత కొంత కాలంగా కొత్తగూడెంలో గడాల శ్రీనివాసరావు వివిధ సేవా కార్యక్రమాలతో యాక్టివిటీస్ పెంచేశారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో డీహెచ్ వ్యవహారంపై ఎమ్మెల్యే వనమా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో డీహెచ్ పర్యటన పట్ల ఆయన మండిపడుతున్నారు. పాల్వంచలో జరిగిన పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా బీఎస్ఆర్ ట్రస్ట్ పేరిట గడల శ్రీనివాస్ రావు పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే ఎమ్మెల్యే ఆదేశాలతోనే సిబ్బంది ఈ ఫ్లెక్సీలను తొలగించారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గడాల చేసిన రావణాసుర కామెంట్స్ దుమారంగా మారాయి. అయితే డీహెచ్ చేసిన కామెంట్స్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఉద్దేశించి కాదని.. ఆయన కుమారుడు రాఘవేంద్రను ఉద్దేశించి మాత్రమేనని శ్రీనివాస్ వర్గీయులు పేర్కొంటున్నారు.