💥 *బ్రేకింగ్ న్యూస్*
*బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..!*
*ఈ నెల 20 న ప్రియాంక గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలోకి..
*ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి*.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మర్రి జనార్ధన్ రెడ్డి సహకరించలేదని దామోదర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుండి దామోదర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి మధ్య అంతరం కొనసాగుతుంది. ఈ ఏడాది జూన్ 10వ తేదీన కాంగ్రెస్ నేత మల్లు రవితో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందే నియోజకవర్గ వ్యాప్తంగా తన అనుచరులుతో దామోదర్ రెడ్డి తనయుడు సమావేశాలు నిర్వహించారు. పార్టీని వీడే విషయమై అనుచరులతో చర్చించారు. అయితే జూన్ మాసంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన సీఎం కేసీఆర్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై దామోదర్ రెడ్డి వెనక్కు తగ్గారా అనే ప్రచారం సాగింది.