కాలుష్యం కోరల్లో కృష్ణానది..!! మూసీని తలపిస్తున్న కృష్ణా నది..!!

మూసీని తలపిస్తున్న కృష్ణా నది సజీవ రూపాన్ని కోల్పోతున్న కృష్ణా కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నజీవనది ప్రజల అవగాహనా లోపం.అధికారుల అలసత్వం కృష్ణమ్మకు శాపంలా మారిన వైనం టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు.వేల కొద్దీ గ్యాలన్ల డ్రైనేజీ వాటర్‌తో మురికికూపంలా మారిన కృష్ణానది ప్రభుత్వం. అధికారులు పట్టించుకోవాలని స్థానికుల వినతి…కృష్ణా నది తన సజీవ రూపాన్ని కోల్పోతోంది. లక్షలాది ఎకరాలకు సాగు నీరు, వేల గ్రామాలకు తాగు నీరు అందించే కృష్ణమ్మ కాలుష్య కోరల్లో చిక్కుకుని కకావికలం అవుతోంది. టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు. వేల కొద్దీ గ్యాలన్ల డ్రైనేజ్ వాటర్ నీటితో కృష్ణా నది మురికికూపంలా మారుతోంది.× ☰ Home > జాతీయం Krishna River: మూసీని తలపిస్తున్న కృష్ణా నది.. కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న జీవనది Shekhar G 10 July 2023 7:57 AM Krishna River: మూసీని తలపిస్తున్న కృష్ణా నది.. కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న జీవనది Krishna River: మూసీని తలపిస్తున్న కృష్ణా నది సజీవ రూపాన్ని కోల్పోతున్న కృష్ణా కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నజీవనది ప్రజల అవగాహనా లోపం.అధికారుల అలసత్వం కృష్ణమ్మకు శాపంలా మారిన వైనం టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు.వేల కొద్దీ గ్యాలన్ల డ్రైనేజీ వాటర్‌తో మురికికూపంలా మారిన కృష్ణానది ప్రభుత్వం. అధికారులు పట్టించుకోవాలని స్థానికుల వినతి Also Read – Heavy Rains: హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి.. లోతట్టు ప్రాంతాలు జలమయం కృష్ణా నది తన సజీవ రూపాన్ని కోల్పోతోంది. లక్షలాది ఎకరాలకు సాగు నీరు, వేల గ్రామాలకు తాగు నీరు అందించే కృష్ణమ్మ కాలుష్య కోరల్లో చిక్కుకుని కకావికలం అవుతోంది. టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు. వేల కొద్దీ గ్యాలన్ల డ్రైనేజ్ వాటర్ నీటితో కృష్ణా నది మురికికూపంలా మారుతోంది. Also Read – Amarnath Yatra: వరుసగా రెండో రోజు కూడా అమర్‌నాథ్‌ యాత్రకు బ్రేక్.. చిక్కుకుపోయిన తెలుగుయాత్రికులు స్వచ్ఛంగా ఉండే కృష్ణా నీరు రోజూ రోజుకీ రంగు మారుతోంది. జీవ నదిగా పేరొందిన కృష్ణమ్మ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వేల కిలోమీటర్ల పారుతూ వస్తున్న కృష్ణా నదిలో… నిత్యం వేల గ్యాలన్ల మురుగు నీరు, టన్నుల కొద్దీ చెత్త కలుస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజల అవగాహనా లోపం, అధికారుల అలసత్వం వెరసి కృష్ణమ్మ పాలిట శాపంలా మారింది. తెలంగాణ భుబాగం నుంచి ఏపీలోకి కృష్ణా నది పారుతున్న క్రమంలో తెలంగాణా రాష్ట్ర లొ వాడపల్లి నుండి మట్టపల్లి వరకు,, మట్టపల్లి నుండి చింతలపాలెం మండలం నుండి పులిచింతల ప్రాజెక్టు ద్వారా జగ్గయ్యపేటకు, సమీపంలోకి చేరుకుంటుంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రీల పరిధిలోని సిమెంట్, కెమికల్ ఫ్యాక్టరీలతోపాటు డ్రైనేజ్ వ్యర్థాలతో పాటు నదిలో కలుస్తుండడంతో నది మూసీని తలపిస్తోంది.!!!.జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల నుంచి… దిగువన ఉన్న అవనిగడ్డ సమీపంలోని హంసలదీవి వద్ద కృష్ణా నీరు సముద్రంలో కలుస్తోంది. జిల్లాలో సుమారు 100 కిలోమీటర్ల మేర నదీ ప్రవాహం ఉండగా… ప్రకాశం బ్యారేజీ వద్ద ఏడాది పొడవునా 12 అడుగుల మేర 3 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఎగువన ఉన్న గుంటూరు జిల్లాలోని పులిచింతల వద్ద 45 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. నీరు ప్రవాహంలా కాకుండా నిల్వ ఉంటోంది. ప్రజలు చెత్త వేయడంతో కలుషితం అవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాకుండా కృష్ణా నది పరివాహక ప్రాంతాలు చాలా గ్రామాలు కూడా ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పలు గ్రామాల ప్రజలు ఈ నీరు తాగడం వారికి ఇటీవల కొంత అనారోగ్యాలు ఎదురుకావడం కూడా మరింత ఆందోళనకు గురిచేస్తుంది..