జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికపై సస్పెన్స్‌..!?

.

అయితే, జూపల్లి కాంగ్రెస్‌లో చేరిక వాయిదా పడినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ కాంగ్రెస్‌ కొల్లాపూర్‌ సభ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో సభ వాయిదా పడే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. సభ వాయిదాపై కాంగ్రెస్‌ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇక, ఈనెల 20వ తేదీన జూపల్లి చేరిక సందర్భంగా సభ నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్లాన్‌ చేసింది.

కాంగ్రెస్‌లోకి బీజేపీ సీనియర్‌ నేత..
ఇదిలా ఉండగా.. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ రాష్ట్రనేత ఒకరు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దేవరకద్ర నియోజకవర్గంలోనూ గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్ననేత చేరికపైనా చర్చ నడుస్తోంది. ఇక, జడ్చర్ల నియోజకవర్గంలో ఓ కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.