అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితా..

అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమ‌వారం తెలంగాణ‌ భవ‌న్‌లో ప్ర‌క‌టించారు. అభ్య‌ర్థుల్లో పెద్ద‌గా మార్పులు, చేర్పులు లేవ‌ని, కేవ‌లం ఏడు స్థానాల్లో మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను మారుస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు…


కంటోన్మెంట్‌ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు. కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్‌ నిరాకరించినట్లు సీఎం చెప్పారు. వైరా, ఆసిఫాబాద్‌, బోథ్‌, ఉప్పల్‌ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీఎం చెప్పారు. హుజూరాబాద్‌ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామని సీఎం వెల్లడించారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు…

వేములవాడ టిక్కెట్ మారుస్తున్నాం

7గురు మాత్రమే మారుతున్నారు..

అందరికి సిట్టింగ్ లకే ఇస్తున్నాం

బోథ్, ఆసిఫాబాద్, వైరా,ఉప్పల్, కోరుట్ల,

ములుగు – నాగజ్యోతి

నర్సాపూర్, జనగామ గోషామాల్ పెండింగ్