గుండెపోటుతో మృతి చెందిన అన్నకి రాఖీ కట్టిన చెల్లెలు…

గుండెపోటుతో మృతి చెందిన అన్నకి రాఖీ కట్టిన చెల్లెలు..
ఇటీవల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మంది దీనికి బలైపోతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువతలో గుండెపోటు ఎక్కువగా వస్తోంది. తాజాగా పెద్దపల్లి లో విషాదం చోటు చేసుకుంది..

పెద్దపల్లి – ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్య అప్పటిదాకా సంతోషంగా ఉండి ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు.

రాఖీ కట్టడానికి వచ్చిన ఆయన సోదరి గౌరమ్మ పుట్టెడు దుఖంతో కడసారిగా కనుకయ్య మృతదేహానికి రాఖీ కట్టి అన్నను సాగనంపింది. చెల్లెలు అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.