మద్యం మత్తులో భర్తను చంపిన భార్య..

మద్యం మత్తులో భర్తను చంపిన భార్య..

రోజురోజుకీ హత్యలు రకరకాలుగా పోతున్న సమయంలో.. కొందరు స్థలాల కోసం, మరికొందరు వ్యసనాలకు బానిసలై,, మరికొందరు చనికావేశంలో చేసే తప్పులే వారి జీవితాంతం వారిని వెంటాడుతున్నాయి.. అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో జరిగింది.. మద్యం మత్తులో ఉన్న మహిళ తన భర్తని కోపంతో రోకలిబండతో అత్యంత దారుణంగా కొట్టి చంపింది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా – పెంచర్ల గ్రామంలో నిన్న రాత్రి మద్యం మత్తులో భర్త మీద కోపంతో రోకలితో దారుణంగా కొట్టి హత్య చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సత్తెమ్మను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు..కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.