కడియం శ్రీహరికి మద్దతు తెలిపిన తాటికొండ రాజయ్య…!! సయోధ్య కుదిరించిన కేటీఆర్..!

బీఆర్ఎస్లో ఉప్పునిప్పులా ఉండే ఇద్దరు నేతలు చేతులు కలిపారు. తన ప్రత్యర్థి విజయం కోసం ప్రయత్నిస్తానని చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మరిది…

కడియం శ్రీహరికి మద్దతు తెలిపిన తాటికొండ రాజయ్య..
తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారం కోసం గులాబీ బాస్ కలలు కంటున్నారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో రెండు దఫాలుగా అధికారాన్ని కొనసాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీ మూడవ దఫా కూడా గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తుంటే పార్టీ నేతలు మాత్రం అంతర్గత కలహాలను వదిలిపెట్టటం లేదు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరు, టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి తాటికొండ రాజయ్యల మధ్య పంచాయితీ తారాస్థాయి కి చేరుకుంది.

ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది.. వీరిమధ్య సయోధ్యకు పల్ల రాజేశ్వర్ రెడ్డి ని రంగంలోకి దింపగా ఇరువురిని కూర్చోబెట్టి సయోధ్య చేయడం జరిగింది.. రాజయ్యకు నామినేటెడ్ పదవి కానీ ఎమ్మెల్సీ కానీ హామీ ఇచ్చినట్లు సమాచారం..!

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య.!!.