మంత్రి రజని కార్యాలయంపై దాడి…

*BREAKING NEWS*

మంత్రి రజని కార్యాలయంపై దాడి.

గుంటూరు జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి…

మంత్రి విడదల రజని కార్యాలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

నిందితుల కోసం గాలిస్తున్నా పోలీసులు…

నేడు కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి రజని

గుంటూరులో ఒక్కాసారిగా రాజకీయాలు వేడెక్కాయి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. గుంటూరు వెస్ట్‌లో నూతనంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై దాడి చేసి… అద్దాలు ధ్వంసం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలుచేసుకుంటూ.. మంత్రి కార్యాలయం సమీపంలో హంగామా చేశారు. ఇక్కడ వద్దంటూ పోలీసులు వారిని వారించారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంపై దాడి దిగడంతో..నూతన కార్యాలయం అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాగా..నేడు ఆ కార్యాలయాన్ని మంత్రి విడదల రజిని ప్రారంభించనున్నారు…