హుజూర్ నగర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం..

*సూర్యాపేట జిల్లా..*

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం..

మొత్తం సభ్యులు 28 మంది కౌన్సిలర్లు ఉండగా.

అవిశ్వాస తీర్మానానికి హాజరైంది 24 మంది కౌన్సిలర్లు…

అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన వారు 22 మంది కౌన్సిలర్లు…

అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన 2 కౌన్సిలర్లు..

హాజరు కాని కౌన్స్ లర్లు..4…

*ఆర్డీవో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ*

హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు పై నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా,, అందులో 24 మంది కౌన్సిలర్లు హాజరుకాగా 22 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడం జరిగింది…. పూర్తిస్థాయిలో అవిశ్వాస తీర్మానానికి ఫారం ఉండడంతో, అవిశ్వాసం తీర్మానం నెగ్గినట్లు అయింది…. ఇదే సమాచారాన్ని తమ పై అధికారి కలెక్టర్ కి విన్నవించుచున్నట్లు తెలిపారు..

బిఆర్ఎస్ పార్టీకి షాక్.

నిన్నటి వరకు కూడా బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఈరోజు అవిశ్వాస తీర్మానానికి సభ్యులు కొందరు హాజరు కాకపోవడం వచ్చిన సభ్యులకు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపటం ఆ పార్టీకి షాక్ గురిచేసింది….

అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా కనీసం హాజరు కాకపోవడం హాజరైన ఆరుగురు లో నలుగురు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపటం ఇద్దరు మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించడం జరిగింది… ఈ పరిణామం బిఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే మారినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జారీ చేసిన, దాన్ని ఏమాత్రం కూడా పరిగణంలో తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని పార్టీలో చర్చ జరుగుతోంది..